పస్తాపూర్‌లో ఘనంగా బతుకమ్మ చీరల పంపిణీ: ఆనందం వ్యక్తం చేసిన మహిళలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జహీరాబాద్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని పస్తాపూర్ మూడో వార్డులో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి, పార్లమెంట్ ఇంచార్జ్ వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సిద్ధం ఉజ్వల్ రెడ్డి, కొత్తపల్లి భాస్కర్ రెడ్డి పాల్గొని మహిళలకు చీరలు అందజేశారు. సీడీసీ చైర్మన్ ఎండీ ముబీన్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరై ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు.