వయోవృద్ధుల హక్కులపై విస్తృత అవగాహన కల్పించాలన్న కలెక్టర్ కోయ శ్రీహర్ష
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లాలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఎల్డర్ గైడ్ అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆవిష్కరించారు. వృద్ధుల సంరక్షణ, భద్రత, హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. వృద్ధులను గౌరవంగా చూసుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు.