వందేభారత్ స్లీపర్: ప్రయాణికులకు ఊరటనిచ్చేలా సరికొత్త డిజైన్ లేఅవుట్

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

సాధారణ రైళ్లలో ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులను తొలగించేలా వందేభారత్ స్లీపర్ కోచ్లలో సరికొత్త డిజైన్ను రూపొందించినట్లు ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ ధనంజయ్ కుమార్ వెల్లడించారు. ప్రవేశ ద్వారం వద్ద స్లైడింగ్ డోర్, బెర్త్ల మధ్య అదనపు స్థలం ఉండటం వల్ల రాత్రి సమయాల్ లో ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం కలగదని ఆయన పేర్కొన్నారు. ఈ నూతన లేఅవుట్ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తుందని సోషల్ మీడియాలో ప్రయాణికులు ప్రశంసిస్తున్నారు.