భూ సర్వే పనులను పరుగులు పెట్టించాలని కలెక్టర్ హుకుం
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల జిల్లాలో రీ సర్వే పనులు, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వి.రాములు అన్నారు. బుధవారం మందమర్రి మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పరిశీలించారు. పెండింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలకు నిర్ణీత సమయంలోగా ధ్రువపత్రాలు అందజేసేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.