వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం: సంజీవని ప్రాజెక్టుపై ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో సంజీవని ప్రాజెక్టుపై ఆశా కార్యకర్తల నుంచి డీఎంహెచ్వోల వరకు వివిధ స్థాయుల ఉద్యోగులు లక్షా రెండు వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, డిసెంబరు పదో తేదీన ట్రయల్ రన్ నిర్వహించి జనవరి మొదటి తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.