సెలెక్టర్ల కుర్చీ ముళ్ల కిరీటం అంటూ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: సునీల్
స్థలం: న్యూఢిల్లీ
జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవి ఎంత గౌరవప్రదమైనదో అంతే ప్రమాదకరమని, ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తిపై ఎప్పుడూ నిరంతర ఒత్తిడి ఉంటుందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. ఇతర సభ్యుల నిర్ణయాల వల్ల వచ్చే విమర్శలన్నీ చైర్మన్ మీదే పడతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కెప్టెన్లపై నెపం నెట్టేసేవారని తన పాత అనుభవాలను గవాస్కర్ గుర్తుచేశారు.