శంకుస్థాపన దిమ్మకే పరిమితం.. రోడ్డు పనులెప్పుడో?

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ పట్టణంలోని లక్కారం మోడల్ స్కూల్ ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలిచి రాకపోకలకు ఆటంకంగా మారుతోంది. రోడ్డు నిర్మాణానికి నెల రోజుల క్రితం శంకుస్థాపన దిమ్మ ఏర్పాటు చేసినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.