భారత స్టీల్ వృద్ధికి ఫెర్రో అలాయ్స్ రంగాధారం
రిపోర్టర్: రమేష్
స్థలం: గోవా
గోవా వేదికగా జరుగుతున్న 6వ అంతర్జాతీయ ఫెర్రో అలాయ్స్ సదస్సులో ఇండియన్ ఫెర్రో అల్లాయ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. దేశంలో వేగంగా విస్తరిస్తున్న స్టీల్ పరిశ్రమ ఫెర్రో-అలాయ్స్ రంగానికి సరికొత్త వృద్ధి అవకాశాలను కల్పిస్తోందని ఐఎఫ్ఏపీఏ చైర్మన్ మనీష్ సర్దా స్పష్టం చేశారు. 2031 నాటికి 300 మిలియన్ టన్నుల స్టీల్ తయారీ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో భారత్ అడుగులు వేస్తోందని, ముడిసరుకు భద్రతకు ప్రభుత్వాలు పెద్దపీట వేయాలని ఆయన కోరారు.