తిరుమలలో కీలక నిర్ణయం: సిఫార్సు లేఖల స్వీకరణ తాత్కాలిక నిలిపివేత
రిపోర్టర్: మహేష్
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి దర్శనం, వసతిపై టీటీడీ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో, ప్రముఖులు మరియు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే అన్ని రకాల సిఫార్సు లేఖల స్వీకరణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలకు కట్టుబడి భక్తులందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని, సిఫార్సు లేఖలతో వచ్చే వారికి దర్శనాలు రద్దు చేసినట్లు వెల్లడించారు.