వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర పెంపు: నవంబర్ ఒకటో తేదీ నుంచి మోత
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
ఎల్పీజీ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ సంస్థలు షాకిచ్చాయి. నవంబర్ ఒకటో తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచినట్లు ఆ సంస్థల అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా పందొమ్మిది కిలోల సిలిండర్ ధర రూ.10 నుంచి రూ.17 వరకు పెరిగింది. అయితే గృహ వినియోగ గ్యాస్ ధరల్ లో ఎలాంటి మార్పు చేయలేదని అధికారులు స్పష్టం చేశారు.