ఓటు హక్ కు వినియోగించుకుని విజయంపై ధీమా వ్యక్తంచేసిన రమణమూర్తి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పోలాకి

పోలాకి మండలం ముబగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సతీసమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన స్వగ్రామంలో ఓటు వేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఎన్నికలలో తప్పనిసరిగా కూటమి విజయం సాధిస్తుందని, ప్రజల అండదండలు ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.