హైదరాబాద్ లో భారీ గంజాయి గుట్టురట్టు: ముగ్గురు నిందితుల అరెస్ట్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

అంతర్రాష్ట్ర గంజాయి రవాణా చేస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ, పోచారం పోలీసులు సంయుక్తంగా చేధించారని డీసీపీ అనురాధ తెలిపారు. ఘట్కేసర్ మండలం అన్నోజిగూడ శివారులో నిర్వహించిన తనిఖీల్ లో కారులో తరలిస్తున్న అరవై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దీని విలువ సుమారు ముప్ పై లక్షల రూపాయలు ఉంటుందని, ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.