దళిత ఐపీఎస్ మహేష్ భగవత్‌కు అవమానంపై పెనుదుమారం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన గణేశ్ ఉత్సవాల సమీక్షా సమావేశంలో సీనియర్ దళిత ఐపీఎస్ అధికారి మహేశ్ భగవత్‌ను వెనుక బెంచీకి పరిమితం చేయడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. ప్రొటోకాల్ ప్రకారం ముందు వరుసలో ఉండాల్సిన అత్యున్నత అధికారిని కుల వివక్షతోనే దూరంగా ఉంచారంటూ దళిత సంఘాలు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.