ఎమ్మెల్యే సిబ్బందిపై మంత్రి పర్వేష్ వర్మ దాడి అంటూ ఆప్ ధ్వజం

రిపోర్టర్: రాము స్థలం: New Delhi

పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్ పరిధిలో రోడ్డు నిర్మాణ పనుల తనిఖీకి వెళ్లిన రాష్ట్ర మంత్రి పర్వేష్ వర్మ సహనం కోల్పోయి ఎమ్మెల్యే సిబ్బంది సాహిబ్ సింగ్ చెంప చెల్లుమనిపించారు. వీడియో తీస్తున్నాడనే ఆగ్రహంతో మంత్రి ఈ భౌతిక దాడికి పాల్పడ్డారని బాధితుడు తెలిపారు. ఈ ఘటనపై మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, ఆయనను అరెస్టు చేయాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ వివాదం హస్తినా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.