దేశం తరఫున టెస్టు ఆడేందుకు సిద్ధంగా ఉన్నానన్న ముంబై స్పిన్నర్ తనుష్ కోటియన్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ముంబై
దేశం తరఫున టెస్టుల్ లో ఆడే అవకాశం తనకు త్వరలోనే లభిస్తుందని ముంబై జట్టు స్పిన్నర్ తనుష్ కోటియన్ ధీమా వ్యక్తం చేశారు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న ఆయన, సెలెక్టర్ల నిర్ణయంపైనే అంతా ఆధారపడి ఉంటుందని తెలిపారు. రైల్వేస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్లు పడగొట్టి అదరగొట్టిన తనుష్ కోటియన్, తాను మాత్రం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. రాబోయే సిరీస్ల కోసం నిలకడైన ప్రదర్శనే లక్ష్యంగా కష్టపడుతున్నట్లు వెల్లడించారు.