'భక్తులకు మరింత మెరుగైన సేవలు': తిరుమలలో నూతన సేవలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: సతీష్ స్థలం: తిరుపతి

తిరుమలలో భక్తులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో తితిదే చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు. ఆధ్యాత్మికతకు ఆధునిక సాంకేతికతను జోడిస్తూ తిరుమల హీలింగ్‌ అండ్‌ డివోషన్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్, ఆధునికీకరించిన శ్రీవేంకటేశ్వర మ్యూజియం, భక్తులకు ఉచిత బీమా, నందకం యాప్‌తో పాటు దాతలు అందించిన ఎలక్ట్రిక్‌ బస్సుల సేవలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.