కార్మికుడి మృతితో నిండిన శోకసంద్రంలో అండగా నిలిచిన నాయకులు
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి గ్రామానికి చెందిన మేకర్తి రాజేశం గోలేటి సీహెచ్పీలో విధులు నిర్వహిస్తూ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. విధులకు వెళ్తున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, నాయకులు బాధిత కుటుంబాన్ని ఆదివారం నేరుగా పరామర్శించి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇస్తూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.