స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు: ఆరు వారాల్లోగా ప్రక్రియ ప్రారంభం

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని అధికారులు తెలిపారు. బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను న్యాయస్థానం కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.