ఎస్ కోట మండలంలో సుమారు ముప్పై ఎనిమిది లక్షలతో అభివృద్ధి పనుల శంకుస్థాపన
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయనగరం
పల్లె పండుగ మూడో విడతలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం తిమిడి గ్రామంలో సుమారు ముప్పై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే లలిత కుమారి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా గ్రామంలో మౌలిక వసతులు మెరుగవుతాయని అధికారులు స్పష్టం చేశారు.