మగబిడ్డకు నామకరణం చేసిన టాలీవుడ్ హీరో నారా రోహిత్ దంపతులు
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ హీరో నారా రోహిత్, సిరి లెల్లా దంపతులు తమ కుమారుడి పేరును సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది జూన్లో మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ జంట తాజాగా తమ బాబుకు నందన్ రామ నారా అనే పేరును పెట్టినట్లు తెలిపారు. నందన్ అంటే అంతులేని ఆనందాన్ని ఇచ్చేవాడు అని, రామ అనే పేరును కుటుంబంలోని తాతగారి జ్ఞాపకార్థం చేర్చినట్లు వారు స్పష్టం చేశారు.