తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సర్దార్ పటేల్‌కు పవన్ కళ్యాణ్ నివాళి

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడంలో ఆయన ధృడ సంకల్పం, రాజనీతిజ్ఞత కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. నిజాం అణచివేతకు, రజాకార్ల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారందరికీ, ప్రజల్లో స్వేచ్ఛా స్ఫూర్తిని రగిలించిన కవులు, రచయితలకు ఈ సందర్భంగా ఆయన వందనాలు తెలిపారు.