నెల్లూరు రూరల్‌లో రూ.70 లక్షలతో షాదీమంజిల్ నిర్మాణానికి శంకుస్థాపన

రిపోర్టర్: రమేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం 2వ డివిజన్ జన్నత్ హుస్సేన్ నగర్‌లో రూ.70 లక్షలతో చేపట్టిన ముస్లిం షాదీమంజిల్ నిర్మాణ పనులకు తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.