దిల్లీలో దారుణం మైనర్ బాలికపై నకిలీ పోలీసుల సామూహిక అత్యాచారం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: దిల్లీ
దిల్లీలోని కల్కాజీ మందిర్ ప్రాంతంలో ఉన్న ఆస్థా కుంజ్ పార్కులో ఫరీదాబాద్‌కు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు దుండగులు పోలీసులమంటూ బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఒకరైన ఆసిఫ్‌ను ఎన్‌కౌంటర్‌లో అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.