ఉపాధి హామీ పనిదినాలు రెండు వందలకు పెంచాలని చంద్రబాబు విజ్ఞప్తి

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి హామీ పథకం కింద కల్పిస్తున్న పనిదినాలను రెండు వందలకు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అదనపు పనిదినాలు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం ఎంతో కీలకమని స్పష్టం చేశారు.