కొండపిలో ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన

రిపోర్టర్: మహేష్ స్థలం: ప్రకాశం

పల్లె పండుగ మూడో విడతలో భాగంగా ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో ఇరవై నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో పద్నాలుగు కనెక్టివిటీ రోడ్ల నిర్మాణ పనులకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే మార్చి నాటికి కొండపి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అత్యుత్తమ తారు రోడ్లను ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన వెల్లడించారు.