హైదరాబాద్ లో భారీ వర్షాలు వినాయక నిమజ్జనం వేళ ట్రాఫిక్ ఆంక్షలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
భారీ వర్షాల హెచ్చరికలు మరియు వినాయక నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో హైదరాబాద్ లోని సైబరాబాద్ పరిధిలో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 18 నుంచి 25వ తేదీ వరకు ఐటీ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించాలని, విద్యాసంస్థలు ఆన్‌లైన్ తరతులు నిర్వహించాలని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.