ఆమనగల్లులో సహారా బాధితుల ఆందోళన: డిపాజిట్లు తిరిగి ఇప్పించాలని ఎంపీడీవోకు వినతి

రిపోర్టర్: సురేష్ స్థలం: ఆమనగల్లు

సహారా ఇండియా పరివార్ లో నిలిచిపోయిన తమ కష్టార్జితాన్ని తిరిగి ఇప్పించాలని కోరుతూ బాధితులు సోమవారం ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కల్వకుర్తి సహారా బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏజెంట్లు, ఖాతాదారులు ఎంపీడీవోను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. గడువు ముగిసినా సొమ్ము అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం స్పందించి డిపాజిట్లు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.