బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చిన సింగర్ ఝాన్సీ

రిపోర్టర్: రాము స్థలం: సూర్యాపేట

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో సూర్యాపేట జిల్లాకు చెందిన జానపద గాయని ఝాన్సీ అడుగుపెట్టారు. 'అగ్నిపరీక్ష' సీజన్ 2లో నిర్వహించిన కఠినమైన పోటీల్లో సత్తా చాటి, డైరెక్ట్ ఎంట్రీ టికెట్ సాధించి ఆమె హౌస్‌లోకి ప్రవేశించారు. రైతు కుటుంబం నుంచి వచ్చి, తన పాటలతో సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందిన ఝాన్సీ, బిగ్ బాస్ వేదికపై తన ఆటతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.