ఓట్ల చోరీ ఆరోపణలపై రాహుల్ గాంధీ నిప్పులు: మోదీపై తీవ్ర విమర్శలు
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
ఓట్ల చోరీ మరియు ఎన్నికల సంఘం వైఫల్యాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో విపక్ష ఇండియా కూటమి నేతలతో సమావేశమైన ఆయన, ప్రధాని మోదీ, అమిత్ షా మరియు సీఈసి జ్ఞానేశ్ కుమార్ లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాటం ఆపేది లేదని, రాజ్యాంగాన్ని దెబ్బతీసే వారి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని ఆయన హెచ్చరించారు. ఈ నిరసనలపై ఎన్డీఏ వర్గాలు మండిపడ్డాయి.