రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలపై బీఆర్ఎస్ నేతల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలపై చర్చ జరగకుండా డైవర్షన్ రాజకీయాలకు తెరలేపుతోందని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. అక్రమ కేసులు పెట్టి బురద రాజకీయాలు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, రేపటి నుంచే ప్రజా సమస్యలపై మళ్లీ పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది. రేవంత్ రెడ్డి పగబట్టి దండయాత్రలు చేసినా ప్రజల పక్షనే పోరాటం సాగిస్తామని స్పష్టం చేసింది.