తల్లుల ఆరోగ్యంకై పోషణ మాసోత్సవాల అవగాహన సదస్సు
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నాథవరం
నాథవరం మండలం మన్యపురట్ల సచివాలయంలో సూపర్వైజర్ కె విజయ కుమారి ఆధ్వర్యంలో పోషణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిడిపివో గౌరీ తల్లులను ఉద్దేశించి మాట్లాడుతూ అధిక పోషక విలువలు గల ఆహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని సూచించారు. తక్కువ ఖర్చుతో లభించే పౌష్టికాహార మార్గాలపై అవగాహన కల్పించారు. సమావేశం అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించి, గ్రామలో ర్యాలీ నిర్వహించారు.