బీఆర్ఎస్ నేతలపై అట్రాసిటీ కేసులు నమోదు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నిందితులుగా చేర్చారు. విధుల్లో ఉన్న అధికారులపై దాడి, స్పీకర్‌ను దూషించారన్న ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.