ఇంద్రకీలాద్రిపై వైభవంగా మూలా నక్షత్ర వేడుకలు: అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయవాడ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు మూలా నక్షత్ర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు మరియు సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.