మహిషాసుర మర్దిని అమ్మవారి సన్నిధిలో హోమం చేసిన సర్పంచ్‌ శిరీష యాదవ్‌

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండలంలోని పెద్దకొండూరులో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. తొమ్మిదో రోజు మహిషాసుర మర్దినిగా అమ్మవారు భక్తులకు కనువిందు చేశారు. సర్పంచ్ గుండెబోయిన శిరీష ఇస్తారి యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఈ వేడుకల్లో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.