డైలాగులు మర్చిపోయి పాజ్ ఇస్తానన్న అమితాబ్ బచ్చన్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఇండియా
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం వేదికగా తన సినిమా కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను డైలాగులు చెబుతున్నప్పుడు ఇచ్చే పాజ్‌ల వెనుక అసలు రహస్యం అదేనని, కొన్ని సార్లు డైలాగ్ మర్చిపోయి గుర్తు తెచ్చుకోవడానికి అలా ఆగుతుంటానని ఆయన సరదాగా వెల్లడించారు. పాత రోజుల్లో ఫిల్మ్ స్టాక్ చాలా ఖరీదైనది కావడంతో మొదటి టేక్‌లోనే షాట్ పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమించేవారమని అమితాబ్ గుర్తు చేసుకున్నారు.