మహిళా ఉద్యోగుల భద్రతపై సైబరాబాద్ షీ టీమ్స్ ప్రత్యేక అవగాహన సదస్సు
రిపోర్టర్: గోపి
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
గచ్చిబౌలిలోని కేర్లాన్ గ్లోబల్ సొల్యూషన్స్‌లో వందకు పైగా మహిళా ఉద్యోగులతో సైబరాబాద్ షీ టీమ్స్ మరియు ఎస్సీఎస్సీ ఆధ్వర్యంలో మహిళా భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ (Cyberabad Police) వెల్లడించింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అంబికా మరియు ఎస్సీఎస్సీ ప్రతినిధి రష్మి పాల్గొని వ్యక్తిగత భద్రత, డిజిటల్ భద్రతా చర్యలు అలాగే అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై మహిళలకు విలువైన అవగాహన కల్పించారు.