బొట్లగూడూరు అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా సేవా సంకల్ప్ కార్యక్రమం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పామూరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా పామూరు మండలం బొట్లగూడూరు అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ గోళ్ల పద్మజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కోటపాటి జనార్దన్ రావు, బీజేపీ మండల అధ్యక్షుడు ఉమ్మడిశెట్టి శ్రీను పాల్గొన్నారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధిలో అంగన్వాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వయంకృషి సేవా సంస్థ ప్రతినిధి షేక్ నాయబ్ రసూల్, కార్యకర్తలు, గర్భిణులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.