ప్రశ్నించే గొంతుక ఉన్నంతవరకూ కమ్యూనిజం సజీవంగా ఉంటుందన్న కూనంనేని సాంబశివరావు

రిపోర్టర్: kasanivenkatesh స్థలం: నేలకొండపల్లి

పేదల సంక్షేమం, సమానత్వమే కమ్యూనిజం ప్రధాన లక్ష్యాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ఖమ్మం తొలి ఎమ్మెల్యే కామ్రేడ్ కర్నాటి కృష్ణయ్య వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. చిన్నతనంలోనే కమ్యూనిస్టు పార్టీలో చేరి, ప్రజల కోసం జైలు జీవితం అనుభవించి ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు. ప్రశ్నించడమే కమ్యూనిజానికి మూలమని, ప్రశ్నించే మనిషి ఉన్నంతకాలం కమ్యూనిజం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.