పసిఫిక్ మహాసముద్రంలో భారీగా బంగారం, వెండి నిక్షేపాలు గుర్తింపు

రిపోర్టర్: విజయ్ స్థలం: World

పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో చైనా శాస్త్రవేత్తలు సముద్రగర్భంలో భారీ ఖనిజ నిధిని కనుగొన్నారు. సముద్ర అంతర్భాగంలో 700 నుంచి 1,500 మీటర్ల లోతులో అత్యంత విలువైన బంగారం, వెండి నిక్షేపాలను గుర్తించారు. ప్రతి టన్నుకు 15.4 గ్రాముల బంగారం, 1,271 గ్రాముల వెండి ఉన్నట్లు తేలింది. రాగి, ఇనుము, జింక్ వంటి ఇతర ఖనిజాలు కూడా లభించాయి.