చింతలచేను రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభించాలని వైయస్సార్సీపీ నిరసన
రిపోర్టర్: సునీల్
స్థలం: తిరుపతి
తిరుపతిలోని చింతలచేను రైల్వే అండర్ బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళనలో తిరుపతి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, మాజీ మేయర్ డాక్టర్ శిరీషతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. బ్రిడ్జి అందుబాటులోకి రాకపోవడంతో ప్రయాణికులు, స్థానికులు పడుతున్న ఇబ్బందులను ఈ సందర్భంగా నేతలు తీవ్రంగా ఎత్తిచూపారు.