గాజువాక వినాయక మండపం వద్ద పోలీసులకు నిర్వాహకులకు మధ్య వాగ్వివాదం

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

విశాఖపట్నం జిల్లా గాజువాకలో కోటి గాజులతో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద ఈరోజు ఉద్రిక్తత నెలకొంది. డీ మార్ట్ పక్కన ఏర్పాటు చేసిన విగ్రహం చుట్టూ స్టాల్స్ ఏర్పాటు విషయమై నిర్వాహకులకు, పోలీసులకు, జీవీఎంసీ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. విగ్రహానికి మాత్రమే అనుమతి ఉందని, కమర్షియల్ షాపులకు అనుమతి లేదని అధికారులు అడ్డుకోవడంతో గొడవ తారాస్థాయికి చేరింది. రేపు ఉదయం విగ్రహ నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు తెలపడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.