శ్రీశైలంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: నవదుర్గ రూపంలో భ్రమరాంబిక దర్శనం
రిపోర్టర్: గోపి
స్థలం: శ్రీశైలం
అంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నట్లు దేవస్థాన అధికారులు వెల్లడించారు. ఈ తొమ్మిది రోజుల పాటు శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో అమ్మవారు నవదుర్గ రూపంలో భక్తులకు ప్రత్యేక దర్శనమివ్వనున్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి నవావరణ పూజలు, చండీయాగం, రుద్రయాగంతో పాటు వివిధ రకాల వాహన సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపారు.