టీస్టా నదిలో కొట్టుకుపోయిన ఏనుగు పిల్లను కాపాడిన మత్స్యకారులు
రిపోర్టర్: Alfa News
స్థలం: బైకంఠాపూర్
వెస్ట్ బెంగాల్లోని జల్పైగురి జిల్లా, మాల్బజార్ బ్లాక్ పరిధిలోని బైకంఠాపూర్ అటవీ ప్రాంతంలో శుక్రవారం రోజు టీస్టా నదిలో కొట్టుకుపోయిన ఏనుగు పిల్లను మత్స్యకారులు సాహసించి కాపాడారు. అనంతరం దానిని సురక్షితంగా అటవీ శాఖ అధికారుల సహకారంతో తల్లి ఏనుగు దగ్గరికి చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.