మూసీ ప్రక్షాళన పేరుతో లక్ష కోట్ల లూటీ: కాంగ్రెస్‌పై కేటీఆర్ మండిపాటు
రిపోర్టర్: నరేష్
స్థలం: రాజన్న సిరిసిల్ల
మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో రూ. 1.5 లక్షల కోట్ల భారీ లూటీ జరుగుతోందని, దీనికి వ్యతిరేకంగా తాము ఎప్పటినుండో పోరాడుతున్నామని కె.టి. రామారావు (KTR) వెల్లడించారు. పబ్లిక్ హియరింగ్ మరియు డీపీఆర్ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేపడుతోందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితర నేతలు పరిశీలనకు వెళ్లగా అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.