అన్నదాతల ఆక్రోశం: చెరువుల్లో మోటర్లు పెడితే కఠిన చర్యలు తప్పవన్న నీటిపారుదల శాఖ
రిపోర్టర్: సునీల్
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి వనరుల నుంచి మోటర్ల ద్వారా నీటిని వాడుకుంటే కఠిన చర్యలుంటాయని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారని, ఈ నిర్ణయంతో కండ్లముందు ఎండుతున్న పంటలను కాపాడుకోలేక అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని నమస్తే తెలంగాణ పేర్కొంది. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లలో నీటి వినియోగంపై ఆంక్షలు విధించడంతో, ఎకరానికి నలభై వేల రూపాయల పెట్టుబడి పెట్టిన తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు.