ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి తెలంగాణ రక్షణ సేన: అభ్యర్థిగా శ్రీకాంత్ గౌడ్

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

వరంగల్ - ఖమ్మం - నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ను ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దసరా పండగ సందర్భంగా ఈ కీలక అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్న ఈ పార్టీ తరఫున బీసీ వర్గానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ను బరిలోకి దించడం ప్రాధాన్యత సంతరించుకుంది.