అజాగ్రత్త డ్రైవింగ్తో వ్యక్తి మృతికి కారణమైన కారు డ్రైవర్కు ఒక సంవత్సరం జైలు శిక్ష

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చిత్తూరు

చిత్తూరు పట్టణంలోని మారుతి సుజుకి షోరూమ్ ఎదుట జాతీయ రహదారిపై అజాగ్రత్తగా కారు నడిపి ఆటోను ఢీకొన్న ఘటనలో బి. రఘు మృతి చెందగా, డ్రైవర్ ఉదయ్ కుమార్తో పాటు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ కేసును విచారించిన 3వ ఏడీఎంఎం కోర్టు జడ్జి నిందితుడు కే.ఆర్. సుబ్రమణ్య రావుకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు 13 వేల రూపాయల జరిమానా విధించారు. ట్రాఫిక్ పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాల ఆధారంగా ఈ తీర్పు వెలువడింది.