అమెరికాలో వాణిజ్య సరోగసీ వ్యాపారం: మాతృత్వాన్ని మార్కెట్ సరుకుగా మారుస్తున్న వైనం

రిపోర్టర్: గోపి స్థలం: అమెరికా

అమెరికాలో కమర్షియల్ సరోగసీ పరిశ్రమ రోజురోజుకూ ఊహించని స్థాయిలో పుంజుకుంటోందని ఐక్యరాజ్యసమితి నివేదికలు స్పష్టం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా సరోగసీ మార్కెట్ విలువ పదిహేను బిలియన్ డాలర్లకు చేరుకుందని నిపుణులు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళల గర్భాలను అమ్ముకునేలా ఈ బిజినెస్ మారుతోందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంపన్న వర్గాల కోసం సాగుతున్న ఈ వాణిజ్య సరోగసీ మానవతా విలువులకు ముప్పుగా పరిణమిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.