ఆంధ్రప్రదేశ్ కు ముంచుకొస్తున్న అర్నాబ్ తుఫాను ముప్పు

రిపోర్టర్: విజయ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి అర్నాబ్ తుఫానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.