మత్స్యకారుల కోసం బహుళ ప్రయోజన భవనం నిర్మాణం పూర్తి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా పతివాడ పంచాయతీ బర్రిపేట గ్రామంలో మత్స్యకారుల చిరకాల స్వప్నం సాకారమైంది. రూ.1.32 కోట్ల వ్యయంతో చేపట్టిన బహుళ ప్రయోజనాల సామాజిక భవన నిర్మాణ పనులు కేవలం 12 నెలల్లోనే విజయవంతంగా పూర్తయ్యాయి. 2025 జూలై 27న ప్రారంభమైన ఈ భవనం మత్స్యకార సోదరులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.